తెలుగు ప్రేక్షకుల అభిమానం తనకు అదృష్టమని తమిళ హీరో కార్తీ అన్నారు. గత జన్మల రుణం కావచ్చునని అన్నారు. గ్రామీణ జీవనం, ప్రకృతితో మమేకమైన సాధారణ జీవితం అంటే తనకెంతో ఇష్టమని, రైతుల జీవనశైలి ఎంతో అందంగా ఉంటుందని తెలిపారు. ఒక సినిమా విజయవంతమైతే, తెలుగు అభిమానులు హీరో, హీరోయిన్, సంగీత దర్శకులతో పాటు దర్శకులను కూడా గొప్పగా సెలబ్రేట్ చేయడం తనకు ఆశ్చర్యంగా, కొత్తగా అనిపించిందని కార్తి తెలిపారు.