నేను ఇంకా చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి వడివుక్కరసి

తాను మరణించానని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సీనియర్‌ తమిళ నటి వడివుక్కరసి స్పందించారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఇంకా చనిపోలేదని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండటంతో తన ఆరోగ్యంపై, మరణంపై వదంతులు వ్యాపించాయని తెలిపారు. తన యోగక్షేమాలు తెలుసుకునేందుకు వచ్చిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 350కిపైగా చిత్రాల్లో నటించిన వడివుక్కరసి.. 40కిపైగా సీరియళ్లలోనూ కనిపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕