ఎన్నికల్లో ఓటమితో నిరుత్సాహపడే వ్యక్తిని కాదు: శరద్ పవార్

ఒక ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన తాను నిరుత్సాహపడే వ్యక్తిని కాదని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన జాతీయ వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి పవార్‌ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయాలని, ఎన్నికలు జరగనున్న బిహార్, కేరళ వంటి రాష్ట్రాలపై దృష్టి సారించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్