TG: సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం రేవంత్ సవాల్‌కు నేను సిద్ధం. ఎక్కడికి వస్తావో నువ్వే చెప్పు. టాపిక్, ప్లేస్ నీ ఇష్టం. నీ తప్పులు నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఛాలెంజ్ చేస్తే నిలబడే దమ్ముండాలి' అని అన్నారు.