తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలంటూ కేటీఆర్‌కు సవాలు విసిరిన విషయం తెలిసిందే. దీనిపై గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా ఈ విషయంపై రేవంత్ స్పందించారు. ‘ ప్రధాన పతిపక్ష నేతగా ఎప్పుడు చర్చలకు సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాయమని చెప్పాం. ఆ వెంటనే శాసనసభ సమావేశాలు పెట్టుకుందామని సూచిస్తున్నా. అభివృద్ధిపై చర్చలకు ఆహ్వానించా కానీ సవాలు విసరలేదు’ అని తెలిపారు.