AP: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మహబూబ్ బాషా (37), సింహాద్రిపురానికి చెందిన శివమల్లేశ్వరిని ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో శివమల్లేశ్వరి విడాకులు కోరింది. దాంతో బాషా.. ‘నా జీవితంలో నిన్ను ఎంతో నమ్మాను. నువ్వు లేని జీవితం నాకొద్దు. నా కుమార్తెను కూడా వదిలేసి వెళ్తున్నా.. మళ్లీ నీ జీవితంలోకి రాను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకున్నాడు.