TG: ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. 'సీఎం చంద్రబాబును అభినందిస్తున్నా. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువ లోటు వర్షపాతం ఉన్నా.. మీరు నీటిని ఎత్తిపోసుకున్నారు. అందుకే ఆంధ్రాలో క్రాఫ్ హాలిడే లేదు. కరువు లేదు. కర్ణాటకలో కరువు లేదు. ఉన్నది తెలంగాణలో మాత్రమే. అది కూడా రేవంత్ రెడ్డి వల్లనే' అని KTR విమర్శించారు. హైదరాబాద్లో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని నోటీసులు వస్తున్నాయని KTR అన్నారు.