రోహిత్, విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు తానే కెప్టెన్‌గా మారాడు. అయితే, తన కెరీర్‌లో ఇప్పటికీ 'కెప్టెన్ కూల్' ధోనీ నాయకత్వంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయానని తీవ్రంగా చింతిస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం సూర్య ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఇద్దరూ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.