భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విడాకులపై చాహల్ మౌనం వీడాడు. విడాకులు తీసుకున్న సమయంలో తనను చీటర్ అని ఆరోపించారని, కానీ తన జీవితంలో ఎవర్నీ మోసం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో చాహల్ స్పష్టం చేశాడు. వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు రావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిపాడు. కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చినట్లు చాహల్ వెల్లడించాడు.