TG: రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'నేను అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ కాదు.. నువ్వే అన్‌ఫిట్ ఫర్ పాలిటిక్స్. సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చరిత్రలో ఎన్నడైనా ఉందా? మరి అన్‌ఫిట్ నువ్వా నేనా? నీ లాగా బిల్లులు చెల్లించడానికి 20–30% కమిషన్ తీసుకోలేదు అందులో నేను అన్‌ఫిట్ కావొచ్చు' అని కౌంటర్ ఇచ్చారు.