TG: సిద్దిపేటలో శుక్రవారం టీఆర్ఎస్ కార్యాలయ భూమి పూజ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ చాలా మంది నాయకులకు భూములు ఉన్నాయని, తనకు మాత్రం ఎటువంటి భూమి లేదని ఆమె స్పష్టం చేశారు. అలాగే, హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో రూ. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించి నిమ్స్ (NIMS) నుండి తనకు లేఖ వచ్చిందని పేర్కొంటూ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతితో తనకు ఎటువంటి సంబంధం లేదని కవిత కుండబద్దలు కొట్టారు.