తెలంగాణలో ఏం జరుగుతుందో అర్ధమైతలేదు: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం తెలంగాణ భవన్‎లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కబ్జాలు, కూలగొట్టడంలో నెంబర్ వన్‎గా నిలబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయలేని చేతకాని స్థితిలో ప్రభుత్వం ఉందని, రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూస్తే గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఏర్పాటుకు ముందున్న దయానీయమైన వ్యవసాయ రంగ పరిస్థితి మళ్ళీ వస్తున్నదని అన్నారు.

సంబంధిత పోస్ట్