న్యూఢిల్లీలో భారీ వర్షంలోనూ ఆర్డర్‌ను సకాలంలో డెలివరీ చేసినందుకు ఓ కస్టమర్ ఉచిత పిజ్జాను ఆఫర్ చేయగా డెలివరీ ఏజెంట్ దానిని తిరస్కరించాడు. "ఈ జంక్ ఫుడ్‌ను మీరే తీసుకోండి, ఇలాంటి చెత్త నాకొద్దు.. నేను ఇంటి భోజనమే తింటాను" అని అతను బదులిచ్చాడు. ఈ సంఘటనను కస్టమర్ జూన్ 12న 'ఎక్స్'లో పంచుకోగా, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నగదు టిప్ ఇవ్వాలని సూచిస్తే, మరికొందరు ఏజెంట్ ఇంటి భోజనంపై చెప్పిన మాటల్లో నిజం ఉందని అంటున్నారు.