తన మాజీ ప్రియురాలు లావణ్య చేస్తున్న వ్యాఖ్యలపై హీరో రాజ్ తరుణ్ మరోసారి స్పందించారు. 'తిరగబడర సామీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 'ఈ విషయంపై చట్టపరంగా ముందుకెళ్తాం. తనను మోస చేశానంటున్న లావణ్య ఆధారాలు చూపడం లేదు. FIRలో అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు? దీనిపై ముందుగా నేనే మీడియాతో మాట్లాడాను. నా ప్రతి మాట పచ్చి నిజం. నా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలున్నాయి. నేనింకా వాటిని బయట పెట్టలేదు. నేను తప్పించుకుని తిరగలేదు' అని అన్నారు.