నాకు పొలిటికల్ ఫ్యాన్స్ కంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ: అజారుద్దీన్ (వీడియో)

TG: తనకు రాజకీయ అభిమానుల కంటే క్రికెట్ అభిమానులే ఎక్కువగా ఉన్నారని మాజీ క్రికెటర్, మంత్రి అజారుద్దీన్ మీడియా ఎదుట తెలిపారు. అయితే భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా అభిమానులను పెంచుకుంటానని చెప్పారు. ప్రజల కోసం కష్టపడి పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం, సహచర మంత్రులు, పీసీసీకి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్