పెరిగిన సినిమా టికెట్ల ధరలకు నాకు సంబంధం లేదు: మంత్రి కోమటిరెడ్డి

TG: తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ఫ-2 సినిమా తర్వాత టికెట్ రేట్ల పెంపుకోసం తన వద్దకు రావొద్దని చెప్పినట్లు తెలిపారు. 'పుష్ప-2 సినిమా విడుదల సమయంలోనే మహిళ చనిపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డాను. బాబు ట్రీట్మెంట్ కు కూడా నేనే డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు సినిమాలకు పెరిగిన ధరలకు నాకు సంబంధం లేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్