ఆస్ట్రేలియా పర్యటన తనకు చాలా ఇష్టమని, ఇక్కడ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నారు. ఆసీస్‌పై మూడో వన్డే గెలిచిన అనంతరం ఆయన మాట్లాడారు. వరుసగా రెండు సార్లు డకౌట్ అయిన తర్వాత హాఫ్ సెంచరీ సాధించడం ఆనందంగా ఉందన్నారు. రోహిత్ శర్మతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఛేజింగ్ తనలో ఉత్తమ ఆటను బయటకు తెస్తుందన్నారు.