పెళ్లంటే తనకు భయమని నటి శ్రుతి హాసన్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. నమ్మకం, నిబద్ధతలపై గాఢమైన విశ్వాసం ఉన్నప్పటికీ, వాటిని కేవలం కాగితం ముక్కలో బంధించడమంటే తనకిష్టం లేదన్నారు. తల్లిగా మారాలన్న కోరిక ఎప్పుడూ ఉండేదని, బిడ్డకు తల్లిదండ్రులిద్దరూ అవసరమని భావిస్తానని తెలిపారు. అదే సాధ్యంకాకపోతే దత్తత కూడా ఒక ఎంపికగా చూస్తానని అన్నారు.