నాకేమీ 21 ఏళ్లు కాదుగా: జస్‌ప్రీత్ బుమ్రా (వీడియో)

ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఐదో వికెట్‌ తీసిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోలేదు. దానికి జస్‌ప్రీత్ బుమ్రా సమాధానం ఇచ్చాడు. ‘నిజం చెప్పాలంటే నేను బాగా అలసిపోయా. అందుకే ఎక్కువగా సంతోషపడలేకపోయా. ఎగిరి గంతులు వేయడానికి ఇప్పుడు నేనేమీ 21-22 ఏళ్ల కుర్రాడిని కాదు. అయితే, నా ప్రదర్శనపై ఆనందంగా ఉన్నా’ అని బుమ్రా వెల్లడించాడు.

సంబంధిత పోస్ట్