అవకాశాల కోసం నేనెప్పుడూ పరుగెత్తలేదు: అశోక్ గజపతిరాజు

గోవా రాష్ట్ర గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు సోమవారం నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించారు. ‘గవర్నర్‌గా నన్ను నియమించడం ఆనందంగా ఉంది. నేనెప్పుడూ అవకాశాల కోసం పరుగెత్తలేదు. ఏదైనా అవకాశం వస్తే బాధ్యతగా స్వీకరిస్తా. దేశం కోసం పనిచేయడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. కాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు.

సంబంధిత పోస్ట్