కవితకు బిగ్ షాక్.. TRS పేరుతో రిజిస్టర్ చేయొద్దంటూ ఈసీకి లేఖ

తెలంగాణ రాజ్య సమితి (TRS) పార్టీ పేరుపై పూర్తి హక్కు తనకే ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం వెల్లడించారు. కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRS)ను రిజిస్టర్ చేయొద్దంటూ ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. 2023లోనే తన పార్టీని ఈసీ రిజిస్టర్ చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుతో పది నియోజకవర్గాల్లో పోటీ చేశామని ఆయన పేర్కొన్నారు. కవిత పార్టీ TRS అనే సంక్షిప్త నామంతోనే ప్రచారం చేస్తే, దీనివల్ల తన పార్టీకి నష్టం వాటిల్లుతుందని బాలరంగం ఆరోపించారు. కవిత పార్టీని రిజిస్టర్ చేయొద్దని ఈసీకి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్