పాదయాత్ర సమయంలో రాసుకున్నవన్నీ గుర్తున్నాయి: భట్టి

TG: పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని, రామగుండం ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చేపడుతున్నామని తెలిపారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ భావజాలమని, ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల చేత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రీ-బడ్జెట్ సమావేశాల నుంచి తిరిగి వచ్చినా, ప్రజల కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్