మణిపూర్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లోనే మణి ఉందని, అది దేశానికే మణి వంటిదని మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యామాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో శాంతి నెలకొంటోందని అన్నారు. మణిపూర్ ప్రజల వెంట తాను ఉన్నానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మణిపూర్‌లో 7 వేల కొత్త ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.