ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ సీజన్‌లో ఫైనల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లే చేరుతాయని తాను ముందే అంచనా వేసినట్లు ఆయన గుర్తుచేశారు. పాంటింగ్ జోస్యం నిజమవడంతో ఇప్పుడు ఆయన విజేతపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరు జట్లు సమానంగా బలంగా ఉన్నప్పటికీ, ఫైనల్ అనుభవం కలిగిన జోష్ హేజిల్‌వుడ్ వంటి బౌలర్ ఉండటం ఆర్సీబీకి అదనపు బలమని చెప్పారు. గెలవటానికి గుజరాత్ కంటే ఆర్సీబీకే సుమారు 5% ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పాంటింగ్ అభిప్రాయపడ్డారు.