దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తరచూ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లేదాన్నని, ఆయన తనకు 'అంకుల్' అని, సీఎం అయ్యాక కూడా వెళ్లేదాన్నని, లక్ష్మి పార్వతి అన్నం కలిపి తినిపించేవారని వివరించారు. పుట్టినరోజుకు బంగారం, డైమండ్స్ ఉన్న రింగ్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలిపారు. ఇంటర్ చదివేటప్పుడు క్లాస్ మేట్స్ ను ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లి ఆటోగ్రాఫ్స్ ఇప్పించానని, ఆయన అందరికీ భోజనం పెట్టించారని గుర్తు చేసుకున్నారు.