హీరో రాజ్ తరుణ్ తనకు కావాలని.. అతన్ని దక్కించుకోవడానికే తాను ఇంత పోరాటం చేస్తున్నానని అతడి మాజీ ప్రేయసి లావణ్య తెలిపారు. 'రాజ్ తరుణ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా. నాకంటే ముందు అతను చనిపోతే నేను వితంతువు అవుతా. నేను చనిపోతే అతను నాకు తలకొరివి పెడతాడేమో? రాజ్ తరుణ్ హీరో కాకముందే అతని జీవితంలో నేనున్నా. అతనితోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నా' అని ఆమె అన్నారు . కాగా, ఇవాళ ఆమె ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై నార్సింగి పీఎస్ లో కేసు నమోదైంది.