పంత్‌లా షాట్లు కొట్టాలనుంది: కేఎల్ రాహుల్

లార్డ్స్‌ మైదానంలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దిలీప్ వెంగ్‌సర్కార్ (3) తర్వాత ఎక్కువ సెంచరీలు చేసిన టీమిండియా బ్యాటర్‌గా KL రాహుల్ నిలిచాడు. ఈ క్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. తాను రిషబ్ పంత్‌తో బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదించానన్నాడు. ఎలాగైనా అతడిలా షాట్లు కొట్టాలని ఉందని కేఎల్ రాహుల్ తన మనసులో మాటను బయటపెట్టాడు. రాహుల్ పంత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించాడు.

సంబంధిత పోస్ట్