'నాకు బతకాలని ఉంది'.. BLO ఆత్మహత్య(వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో SIR (Special Intensive Revision) లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకు సర్వేశ్ సింగ్ అనే బూత్ లెవల్ ఆఫీసర్(BLO) ఆత్మహత్య చేసుకున్నారు. తన సూసైడ్ నోట్‌లో, పని ఒత్తిడిని తట్టుకోలేక, అశాంతితో బాధపడుతున్నానని పేర్కొన్నారు. 'నాకు చిన్న పిల్లలు ఉన్నారు. నాకు బతకాలని ఉంది' అని ఆయన చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. EC, బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండిపడింది.

సంబంధిత పోస్ట్