దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్లో కనీసం ఒక్క సినిమానైనా తెరకెక్కించాలనే కోరికను వ్యక్తం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ విజయం తర్వాత హాలీవుడ్ నుంచి తనకు పలు ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాపైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత హాలీవుడ్ ప్రాజెక్టుపై ఆలోచిస్తానని రాజమౌళి పేర్కొన్నారు.