ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల ఓం ప్రకాష్ గౌరీశంకర్ పూణెలో తనను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో తీసి పంపి, తనను విడిచిపెట్టాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు యూపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పుణె పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొబైల్ ఫోన్ ఆధారంగా ఖడ్కీ ప్రాంతంలోని లాడ్జిలో అతడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డబ్బు కోసం తానే కిడ్నాప్ నాటకానికి ప్లాన్ చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.