నన్ను అన్‌లక్కీ హీరోయిన్‌గా ముద్ర వేశారు: తాప్సీ

బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డేట్స్‌ లాక్‌ చేసిన తర్వాత కూడా కొన్ని సినిమాల నుంచి తనను అకస్మాత్తుగా తొలగించారని చెప్పారు. హీరోల ఇగో, వారి భార్యల అభద్రతాభావం కారణంగా అవకాశాలు కోల్పోయానన్నారు. ఓ సందర్భంలో ‘హీరో భార్యకు నువ్వంటే ఇష్టం లేదు.. అందుకే తొలగించాం’ అని చెప్పారని తెలిపారు. సినిమాలు వరుసగా విఫలమైన సమయంలో తనను ‘అన్‌లక్కీ హీరోయిన్‌’గా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లామర్‌గా చూపించడం వేరు.. అనవసరంగా అసభ్యకరంగా చూపించడం వేరని తాప్సీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕