TG: తనను రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తన కూతురు సుస్మిత వ్యక్తిగత అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని, ఆమె వ్యాఖ్యలను ఖండించే అధికారం తమకు లేదని కొండా సురేఖ తెలిపారు. 100 మంది తనను విమర్శిస్తున్నారని, బయటి వ్యక్తులు మాట్లాడితే వారి కుటుంబ సభ్యులను బాధ్యులను చేయడం సరికాదని ఆమె అన్నారు. కాంగ్రెస్లో కొనసాగాలా వద్దా అనే దానిపై ఇంకా ఆలోచించుకోలేదని, కుటుంబ సభ్యులతో మాట్లాడి భవిష్యత్పై నిర్ణయం తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.