‘మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్ రేటు చూసి నేనే భయపడ్డా’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. ‘ఇటీవల ఓ సినిమాకు వెళ్తే రెండు పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ తీసుకుంటే రూ.1200 అయింది. నేను మాత్రం ఏం చేయగలను. థియేటర్‌లో తినుబండారాల రేట్లను క్రమబద్ధీకరించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరాలనుకుంటున్నాం. మనం చెబితే అయ్యే పనులు కాదవి. ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలి’ అని నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.