'నన్ను ఘోరంగా అవమానించారు'.. కోలీవుడ్ హీరో ఆవేదన

‘మండాడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న కోలీవుడ్‌ నటుడు సూరి.. తన కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్‌లో, టాప్ కమెడియన్‌తో కలిసి నటించే సన్నివేశం తర్వాత, దర్శకుడు, హీరో కలిసి తన చొక్కాను విప్పించి, రికమండేషన్‌తో వచ్చిన వేరే వ్యక్తికి ఇవ్వమని చెప్పారని, తన సొంత చొక్కాను లాక్కొని కాస్ట్యూమ్ వెహికల్‌పైకి విసిరేశారని సూరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒంటిపై టవల్ మాత్రమే కప్పుకుని, అవమానంతో తన చొక్కా కోసం వెతుక్కున్నానని, ఆ సమయంలో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని సూరి తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕