ప్రభుత్వ యాజమాన్యంలోని బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి లోగో కలర్ కాషాయంగా మారండంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్పందించారు. ‘దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో దూరదర్శన్ లోగో రంగు రూబీ రెడ్ నుంచి కాషాయ రంగుకు మారింది. ఇది చూసి నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. ఇది పూర్తిగా అనైతికం, చట్టవిరుద్ధం’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.