అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో మెడికల్ కాలేజీపై విమానం కూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే దర్శణ వాఘేలా సమీప ప్రాంతంలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తూ.. 'విమానం కూలిపోయినప్పుడు నేను సమీపంలోని నా కార్యాలయంలో ఉన్నా. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. వైద్యుల ప్లాట్లు దెబ్బతిన్నాయి' అంటూ పేర్కొన్నారు.