AP: తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్ ఫాలోవర్ గానే ఉంటానని మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని ఆయన ప్రశంసించారు. అతను చాలా ఎత్తుకు ఎదిగాడని తెలిపారు. వీలైతే పవన్ కల్యాణ్ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి అని.. లేదంటే అంత గొప్ప వ్యక్తికి సేవకుడిగా ఉండాలని తెలిపారు. తాను పవన్ అంత ఎత్తుకు ఎదగలేనని, అందుకే అతనికి సేవకుడిగా ఉండిపోయానని నాగబాబు చెప్పుకొచ్చారు.