కర్ణాటక సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి సీఎం సిద్దరామయ్య కుండబద్ధలు కొట్టారు. ‘సీఎం మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదు. వచ్చే ఎన్నికల వరకు నేనే సీఎంగా కొనసాగుతాను. సీఎం పదవి ఖాళీగా లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పష్టంగా చెప్పారు. మీడియా ప్రచారమే తప్ప, పార్టీ లోపల ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మేం అనుసరిస్తాం’ అని అన్నారు.