నెలకు రూ. లక్ష ఆ విద్యార్థులకు ఇచ్చేస్తా: వీహెచ్

తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ వి. హనుమంతరావు గొప్ప మనసు చాటుకున్నారు. తన నెల జీతం లక్ష రూపాయలను ఫీజులు క‌ట్ట‌లేని విద్యార్థులకు ఇస్తానని ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారునిగా త‌న‌కు బాధ‌త్య‌లు అప్ప‌గించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి ద్వారా త‌న‌కు నెల‌కు రూ. ల‌క్ష జీతం వ‌స్తుంద‌ని, రెండేళ్లు త‌న ప‌ద‌వి ఉంటుంద‌ని అన్నారు. త‌న రెండేళ్ల జీతాన్ని ఫీజు క‌ట్ట‌లేని స్థితిలో ఉన్న పేద విద్యార్థుల‌కు అందించేలా ట్ర‌స్టుల‌కు ఇస్తాన‌ని చెప్పారు.

సంబంధిత పోస్ట్