'ఎవరిని పెళ్లి చేసుకున్నా చంపేస్తా..'

TG: 'ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని చంపేస్తా' అంటూ ఓ యువతిని ఆమె మాజీ ప్రియుడు బెదిరించాడు. హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఫతేనగర్‌కు చెందిన ఓ యువతి, రవికుమార్‌ ప్రేమించుకుని విడిపోయారు. సదరు యువతికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో రవికుమార్‌.. వరుడికి ఫోన్‌ చేసి ఆమె గురించి చెడుగా చెప్పాడు. తర్వాత యువతికి ఫోన్‌ చేసి బెదిరించాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్