అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కార్యవర్గాన్ని ఎంపిక చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. సీనియర్లను గౌరవిస్తూనే కొత్తవారికి అవకాశాలు కల్పించామని, గుడ్డిగా ఎవరికీ బాధ్యతలు అప్పగించబోనని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవారినే ప్రోత్సహిస్తానని ఆయన పేర్కొన్నారు. టీడీపీయే బలమైన కేడర్ కలిగిన ఏకైక పార్టీ అని ఆయన అభివర్ణించారు.