ఐదు నిమిషాల్లో మోదీ దేశద్రోహి అని నిరూపిస్తా: రాహుల్

పంజాబ్‌లో జరిగిన కాంగ్రెస్ ఇన్సాఫ్ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనతో చర్చకు రావాలని సవాల్ విసిరానని.. కానీ ఆ ధైర్యం మోదీకి లేదని రాహుల్ విమర్శించారు. చర్చకు ఎవరినైనా న్యాయనిర్ణేతగా పెట్టుకోవచ్చని సూచించానన్నారు. చర్చలో పాల్గొంటే ఐదు నిమిషాల్లోనే మోదీ దేశద్రోహి అని నిరూపిస్తానని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీని నియంత్రిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕