వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాల విషాదంలో తన భార్య ఆండ్రియా బెల్లోను కోల్పోయిన ఫుట్‌బాలర్ హెక్టర్ బెల్లో చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న సమయంలో తమ ఏడాది కుమార్తె అలనాను కాపాడి భార్య ప్రాణాలు కోల్పోయిందని ఆయన వెల్లడించారు. "నువ్వే మా హీరో. మన బిడ్డకు నీ ధైర్యం, త్యాగం గురించి చెబుతా. నీ కథ చెప్పి మన బిడ్డను పెంచుతా" అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. భవనం కూలిన ఘటనలో చిన్నారి సురక్షితంగా బయటపడగా, ఆండ్రియా మృతిచెందింది. ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట ఎంతో మందిని కన్నీళ్లు పెట్టిస్తుంది.