పూర్తి రుణమాఫీ జరిగిందని చెబితే రాజీనామా చేస్తా: కేటీఆర్‌

రైతు డిక్లరేషన్‌ పేరిట కాంగ్రెస్‌ నయవంచనకు పాల్పడిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మండిపడ్డారు. వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ 60 ఏళ్లుగా రైతుల రక్తం తాగిందని, రైతు డిక్లరేషన్‌లో 34 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని, ప్రతి నెలా కప్పం కట్టి పదవిని రెన్యువల్ చేసుకుంటున్నారని, ఎ.రేవంత్ రెడ్డి అంటే ఎగవేతల రేవంత్ రెడ్డి అని విమర్శించారు. పూర్తి రుణమాఫీ జరిగిందని ఏ ఊరిలోనైనా రైతులు చెబితే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్