TG: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనే HYD అద్భుతంగా అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపఎన్నిక తర్వాత కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపిస్తే తాను రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.