పర్మిషన్ ఇస్తే శ్రీతేజ్‌‌ను పరామర్శిస్తా: అల్లు అర్జున్

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ కుటుంబానికి నటుడు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారు. శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి గంటగంటకు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. 'నేను థియేటర్‌ వద్ద రోడ్‌షో చేయలేదు. పోలీసుల అనుమతి ఉంటేనే నేను థియేటర్‌కు వెళ్లాను. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. చాలా బాధేస్తోంది. పర్మిషన్ ఇస్తే బాలుడు శ్రీతేజ్‌‌ను పరామర్శిస్తా’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్