తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో TVK పార్టీ అధినేత విజయ్ గెలిచిన అభ్యర్థులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మే 4న ఫలితాలు వెలువడిన వెంటనే, రాత్రి ఏ సమయమైనా పార్టీ ఆఫీసుకు చేరుకోవాలని ఆయన సూచించారు. అక్కడ తమిళ ప్రజల కోసం ఏం చేయాలో వివరిస్తానని విజయ్ తెలిపారు. ఈ ఆదేశాలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.