'నేను BRS గుర్తు పై గెలిచిన.. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే'(వీడియో)

TG: తాను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచానని.. ఇప్పుడు కూడా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. జగిత్యాల అబివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని.. ఆ సందర్భంగా సీఎం శాలువ కప్పరాని అన్నారు. తాను ఎలాంటి ప్రకటన చేయకముందే.. ఆధారాలు లేకుండా తనపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తాను ఎక్కడా చెప్పలేదుని, రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నెలకు రూ.5 వేలు కడుతున్నానని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారు.

సంబంధిత పోస్ట్