బెదిరిస్తే భయపడను: సీఎం రేవంత్‌

తనను ఎవరూ బెదిరించవద్దని, బెదిరిస్తే భయపడనని, స్నేహంతో మాత్రమే తనను గెలవగలరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఎవరికీ గులామ్‌ను కాదని, దోస్తీకి మాత్రమే గులామ్‌నని తెలిపారు. చంచల్‌గూడ-సంతోష్‌నగర్‌ మధ్య భారీ స్టీల్‌ ఫ్లైఓవర్‌ను సీఎం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. స్నేహం కోసం తాను ఏదైనా చేసే వ్యక్తినని, ఎన్నికలు వస్తుంటాయని, పోతుంటాయని, గెలుపోటములు సహజమని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕