చెన్నైలోని తాంబరం ఎయిర్‌బేస్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారత వైమానిక దళానికి చెందిన సింగిల్ సీటర్ శిక్షణా విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి, పైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వైమానిక అధికారులు సాధారణ శిక్షణా సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పైలట్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.